నాగలాపురంలో చింత చెట్లు ఢీకొన్న లారీ, తప్పిన ప్రమాదం
*నాగలాపురంలో చింత చెట్టును ఢీకొన్న లారీ* నాగలాపురం వద్ద పుత్తూరు-చెన్నై బైపాస్‌లో ఆర్చి వద్ద మూడు రోడ్ల కూడలిలో ఓ లారీ మంగళవారం సాయంత్రం చింత చెట్టును ఢీకొంది. ఈలారీ అనంతపురం నుంచి చెన్నైకి వెళుతోందని డ్రైవర్ తెలిపాడు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు తగలలేదు. లారీ ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.