రాజీవ్ నగర్ పై ఎటువంటి అపోహలకు తావులేదు: ఆర్డిఓ శ్రీకాళహస్తి పరిసర ప్రాంతంలోని రాజీవ్ నగర్ ప్రజలు ఎటువంటి అపోహలకు లోన వద్దని ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. నవంబర్ 3 నుంచి వచ్చే 15 రోజులు పాటు రాజీవ్ నగర్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక్కడ 6,500 ఇంటి పట్టాలు ఇచ్చి ఉన్నారని, వాటిలో 1600 ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వాటిని తిరిగి పేదలకు అందజేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.