మంత్రాలయం: పేదింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : మంత్రాలయం నియోజవర్గం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం: పేదింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నియోజవర్గం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మంత్రాలయం మండలం మాధవరంలో ఆయన నూతన గృహాన్ని ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని, పేదల సొంతింటి కలను నెరవేర్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజవర్గం బీజేపీ, జనసేన ఇన్ఛార్జిలు పాల్గొన్నారు.