కరీంనగర్: 1948 సెప్టెంబర్ 17న నిజాం చెర నుండి విముక్తి పొందిన రోజు : రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
సెప్టెంబర్ 17 ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో బుధవారం ఉదయం 11గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించారు రాష్ట్ర SC, ST మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తో పాటు మానకొండూరు MLA కవంపల్లి సత్యనారాయణ, చొప్పదండి MLA మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17, 1948 సంవత్సరంలో తెలంగాణ నిజాం చెర నుండి విముక్తి పొందన్నారు.