గోకవరంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు సమ్మె
గోకవరం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏ గురువారం ఉదయం నుంచి సాయంత్రం సమ్మె చేపట్టారు. తమకు ప్రమోషన్లు ఇవ్వాలని, నెలకు రూ.26,000 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే నామినీలుగా పనిచేస్తున్న వీఆర్వోలను పర్మినెంట్ చేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని వారు తెలిపారు.