గుంతకల్లు: గుత్తి మండలం వన్నెదొడ్డి శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఎద్దుల బండిని ఢీ కొన్న కారు, అవు మృతి, రైతుకు తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని వన్నెదొడ్డి గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఎద్దుల బండిని కారు ఢీకొన్న ప్రమాదంలో రైతు మల్లికార్జునకు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం గుత్తి ఎస్ఐ సురేష్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున తన పొలంలో పనులు ముగించుకొని ఇంటికి ఎద్దుల బండిలో బయలుదేరాడు. జాతీయ రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా బెంగళూరు వైపునకు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఎద్దుల బండిని ఢీ కొట్టగా బండికి వెనకాల కట్టి ఉంచిన ఆవు దూడ అక్కడిక్కడే మృతి చెందింది. సుమారు రూ.1.లక్ష నష్టం వాటిల్లిందని రైతు ఫిర్యాదు చేశాడు.