గజపతినగరం: రైతులందరికీ యూరియా అందిస్తాం: గజపతినగరం లో మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పివివి గోపాలరాజు
రెండు రోజుల వ్యవధి ఇస్తే రైతులందరికీ యూరియా అందిస్తామని సోమవారం సాయంత్రం గజపతినగరం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గజపతినగరం ఎఎంసి చైర్మన్ పీవీవి గోపాల రాజు అన్నారు. యూరియా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. వైసీపీ నాయకులు రాజకీయం చేసి రాక్షసానందం పొందుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో టిడిపి నాయకులు గంట్యాడ శ్రీదేవి, గోవిందా, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.