కాణిపాకం స్వామివారి హుండీ లెక్కింపు రికార్డు స్థాయిలో ఆదాయం
Chittoor Urban, Chittoor | Sep 19, 2025
:కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో హుండీ లెక్కింపులో ఈసారి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. గత 30 రోజుల హుండీ లెక్కింపు ద్వారా ₹2,39,09,202/- రూపాయలు వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి పెంచల కిషోర్ ప్రకటించారు.ఆదాయంతో పాటు 54 గ్రాముల బంగారం, 1 కిలో 910 గ్రాముల వెండి లభించాయి.