కర్నూలు: పదవో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన: కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి
కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధ్యక్షతన గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు స్టడీ మెటీరియల్ అందజేశారు. జిల్లాలోని కర్నూలు, ఆలూరు, రాతన గ్రామాల గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 64 మంది విద్యార్థులు ఈ సహాయాన్ని పొందారు. కలెక్టర్, విద్యార్థులకు ఉత్తీర్ణత సాధించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో జిల్లా జేసీ నూరుల్ కమర్, గిరిజన శాఖ అధికారి సురేశ్ ఉన్నారు.