పాణ్యం: రెండు రోజుల పాటు భారీ వర్షాలు రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఓర్వకల్ విద్యుత్ AE సునీల్ బాబు
ఓర్వకల్లు మండలంలో అన్ని గ్రామాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నందున పంట పొలాల దగ్గర రైతులు అప్రమత్తంగా ఉండాలని ఓర్వకల్లు విద్యుత్ ఏఈ సునీల్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు, విద్యుత్ షాక్ లు తగలకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, పొలాల్లో విద్యుత్ తీగలు తెగిపడితే దూరంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ ఫారంలదగ్గరకు వెళ్లకూడదు, రైతులు విద్యుత్ సమస్యలను సొంతంగా పరిష్కరించడానికి ప్రయత్నించకూడదని, సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు