తుఫాను సమయంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు బాగా పనిచేశారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కితాబులు ఇచ్చారు. శనివారం గిద్దలూరు నియోజకవర్గంలో కలెక్టర్ రాజబాబు పర్యటించిన సందర్భంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తుఫాను సమయంలో అధికార యంత్రాంగం బాగా పనిచేసేందుకు కలెక్టర్ కృషి చేశారని అంతేకాకుండా నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, కూలిపోయిన ఇల్లు, పంట నష్టం పై అంచనా వేసి ప్రజలకు పరిహారం అందాల చేస్తామన్నారు. అధికారులు తుఫాను సమయంలో బాగా కష్టపడ్డారని ఎమ్మెల్యే వారికి కృతజ్ఞతలు తెలిపారు.