కదిరిలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని విద్యుత్ ఏఈ కార్యాలయం ఎదుట మంగళవారం కదిరి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జిలను ధరించి నినాదాలు చేశారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, విద్యుత్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని, అదేవిధంగా తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.