తాడిపత్రి: నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న ముద్దాయికి రిమాండ్ విధించిన తాడిపత్రి జె ఎఫ్ సీఎం కోర్టు
తాడిపత్రి రూరల్ పోలీసులు మంగళవారం నాన్‌బెయిలబుల్ వారెంట్ ఉన్న మహమ్మద్ రఫీని అరెస్టు చేశారు. అనంతరం మేజిస్ట్రేట్ రిమాండ్ కు పంపారు. సింహాద్రి పురానికి చెందిన మహమ్మద్ రఫీ పై 2017లో 498A, 506 ఐ పీ సీ సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. తాడిపత్రి జేఎఫ్ సీఎం కోర్టు ఈనెల 3న నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరపరచుగా ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు.