అసిఫాబాద్: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించిన అంగన్వాడి ఉద్యోగాలు
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల సమస్యలను ప్రస్తావించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అంగన్వాడీలు వాపోయారు.