ఆర్మూర్: పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేసిన పిడిఎస్యు నాయకులు
కాలేజీలకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలో పిడిఎస్యు నాయకులు కళాశాలల బందుకు మద్దతు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని సివిఆర్ కళాశాల ముందు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులతో కలిసి సోమవారం మధ్యాహ్నం 12:40 నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రివర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చేపట్టిన కళాశాలల బందును పిడిఎస్యు సంపూర్ణంగా మద్దతు తెలుపుతుందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో 8500 కోట్ల రూపాయల బకాయ