తిరుమలగిరి: పట్టణంలో ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన తహసీల్దార్ హరిప్రసాద్, సీఐ నాగేశ్వరరావు, ఏడీఏ రమేష్ బాబు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని పిఎసిఎస్ తో పాటు ఎరువుల దుకాణాలను తహసిల్దార్ హరిప్రసాద్ సిఐ నాగేశ్వరరావు ఏడిఏ రమేష్ బాబులు ఆకస్మికంగా బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా కొరత లేకుండా చూడాలని దుకాణ యాజమాన్యులను ఆదేశించారు. స్టాకు రిజిస్టర్ లను పరిశీలించారు. యూరియాను అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్లు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.