నంద్యాల జిల్లా డోన్‌లోని పాతపేటలో వెలసిన ద్రోణపుర వీరాంజనేయ స్వామి ఆలయంలో ఉత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ఆలయ అర్చకుడు విశ్వబ్రాహ్మణ సురేశ్ ఆచారి ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, అన్నదానం చేశారు.