భీంపూర్: జిల్లాలో ఎడతెరిపి లేని వాన, రాకపోకలకు తిప్పలు, పెన్ గంగ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా ముసురువీడక పలు మండలాల్లోని వాగులు, వంకలు, జలపాతాలు జలకలను సంతరించుకున్నాయి.ఆదిలాబాద్ అర్బన్ లో ఆదివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో అత్యధికంగా 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా బజార్హత్నూర్ మండలంలో 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గత రాత్రి కురిసిన వర్షానికి గాదిగూడ మండలంలోని కడ్,కి లోకారి-కే ,దాబా ,అర్జుని లో లెవెల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహించిటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక భీంపూర్ మండలంలో కురుస్తున్న వర్షాలతో వాగులు ,చెరువులు, పెనుగంగా లో వరద నీరు వచ్చి చేరుతుంది.