అనంతపురం: ట్రయాంగిల్ లవ్ స్టోరీ పై సమగ్ర విచారణ చేస్తున్నాం : వన్ టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్
అనంతపురం నగరంలో జరిగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీకి సంబంధించి సమగ్ర విచారణలు చేస్తున్నామని అనంతపురం వన్ టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి శారద అనే విద్యార్థిని మృతి చెందిందని తెలిపారు. షేక్ రేష్మ అనే విద్యార్థిని ప్రస్తుతం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు. సమగ్ర విచారణ చేసి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.