రాయదుర్గం: సంచార జాతుల వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలి : పట్టణంలో AP సంచార జాతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు
సంచార జాతుల వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, రాజ్యాంగంలో 3 వ షెడ్యూలలో చేర్చి డిఎన్టీ క్యాటగిరి గా గుర్తించాలని ఏపీ సంచార జాతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రాయదుర్గం నియోజకవర్గ నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా ఆదివారం మద్యాహ్నం పట్టణంలోని సమైక్యాంధ్ర భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లయినా సంచార జీవనం గడిపేవారికి కనీస హక్కులు లేవన్నారు. తాలూకా నూతన గౌరవ అధ్యక్షులుగా వి.మురడప్ప, రామకృష్ణ, అధ్యక్షులుగా జీ.గంగాధర్, ఉపాధ్యక్షులుగా డి.రవి, వి.నాగేష్, ప్రధాన కార్యదర్శిగా డి.వెంకటేసులు ఎంపికయ్యారు.