రాయచోటి: డిజిటల్ అరెస్ట్ స్కామ్ బట్టబయల్ — మదనపల్లి నుంచి అంతర్జాతీయ గ్యాంగ్ అరెస్ట్: జిల్లా ఎస్పీ ధీరజ్
మదనపల్లి కేంద్రంగా పనిచేస్తూ సీబీఐ–ఈడీ అధికారులమని నటిస్తూ “డిజిటల్ అరెస్ట్” పేరుతో ప్రజలను మోసగిస్తున్న అంతర్జాతీయ సైబర్ గ్యాంగ్‌ను మదనపల్లి 1-టౌన్ పోలీసులు రట్టు చేశారు. 75 ఏళ్ల రిటైర్డ్ మేల్ నర్సు రేపురి బెంజిమెన్ గారిని బెదిరించి రూ.48 లక్షలు కాజేసిన కేసులో పటాన్ ఇంథియాజ్ ఖాన్, షేక్ అమీన్, షేక్ అర్షాద్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు.నిందితుల వద్ద నుండి రూ.32 లక్షల నగదు, 25 ఎటీఎం కార్డులు, మొబైల్స్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా రూ.7.65 లక్షలు ఖాతాల్లో ఫ్రీజ్ చేశారు. కాంబోడియా–కువైట్ కేంద్రంగా ఈ రాకెట్ పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.