దేవిశ్రీ హత్య కేసులో గోవర్ధన్ ను అదుపులో తీసుకున్న బెంగళూరు పోలీసులు.
అన్నమయ్య జిల్లా . మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం బిక్కమానిపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప కుమార్తె దేవిశ్రీ,21 సంవత్సరాలు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలో బి బి ఏ చదువుతున్నది . దేవి శ్రీ ను ఆదివారం బెంగళూరు నగరంలో దారుణ హత్యకు గురైంది. చౌడేపల్లి మండలం కొండమర్రి గ్రామానికి చెందిన గోవర్ధన్ దేవిశ్రీ, హత్య చేసి పారిపోయాడని సమాచారం. దేవిశ్రీ హత్య కేసులో అనుమానితుడుగా ఉన్న గోవర్ధన్ ను తిరుపతిలో బెంగళూరు పోలీసులు అదుపులో తీసుకొని బెంగళూరుకు తరలించినట్లు సమాచారం.