మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బాణాసంచ దుకాణాలను జిల్లా అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాణాసంచ దుకాణ యజమానులు ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా దుకాణాదారులు అన్ని రకాల జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఇన్స్సెక్టర్లు బాలాజీ, వంశీ, అజయ్ ఉన్నారు