జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రాలను సందర్శించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
Eluru Urban, Eluru | Sep 27, 2025
కూటమి ప్రభుత్వ చొరవతో వర్జినియా పొగాకు , పామాయిల్ రైతులు సంతోషంగా ఉన్నారని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వర్జినియా పొగాకు వేలం కేంద్రాలను శనివారం సాయంత్రం ఎంపీ సందర్శించారు. తొలుత పొగాకు కొనుగోళ్లు , అమ్మకాలను పరిశీలించారు. అనంతరం బోర్డు ఆవరణలో జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పరిశీలించి విద్యార్థులకు , అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ మీడియాతో మాట్లాడుతూ వర్జినియా పొగాకు ధర కిలో 430 రూపాయల వరకు ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఈ ఏడాది వర్జినియా పొగాకుకు చరిత్రలో లేని