కర్నూలు: జనవరి 4న విశాఖ ఆర్కే బీచ్‌లో జరగనున్న చలో విశాఖ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు.
జనవరి 4న విశాఖ ఆర్కే బీచ్‌లో జరగనున్న చలో విశాఖ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు చ్లో విశాఖ పోస్టర్లను కర్నూలు కార్మిక–కర్షక భవన్‌లో విడుదల చేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.ఎస్. రాధాకృష్ణ, వై.అంజిబాబు మాట్లాడుతూ— “ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖలో జరగడం కార్మిక వర్గానికి గర్వకారణం” అన్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులపై దాడులు కొనసాగిస్తున్నాయిని విమర్శించారు. లేబర్ చట్టాలను మార్చి కార్మికులను కట్టుబానిసలుగా మార్చే ప్రయత్నాలను మహాసభల ద్వార