జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ప్రజాపాలన దినోత్సవము కార్యక్రమం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ప్రజాపాలన దినోత్సవము కార్యక్రమంను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9-30 గంటల ప్రాంతంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తాటిపర్తి రామచంద్రారెడ్డి, బండ శంకర్, గాజుల రాజేందర్, కల్లేపల్లి దుర్గయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారని అన్నారు వారి త్యాగ ఫలితమే న