రోడ్డుపై ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు : అచ్చంపేట ఎస్సై వెంకటేశ్వరరావు
రోడ్డుపై మృతదేహంతో ధర్నా చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని పలనాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండల ఎస్సై వెంకటేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మాట్లాడుతూ ఏ సమస్య ఉన్న పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. రోడ్డుపై ధర్నా చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగి ప్రయాణికులు ప్రజలు ఇబ్బందులు పడతారని ఆయన నచ్చచెప్పారు. ఏ సమస్య అయినా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. దీంతో బంధువులు న్యాయం చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.