ఆదోని: ఆదోనిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
Adoni, Kurnool | Sep 26, 2025 ఆదోనిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందుల పడ్డారు. 3 రోజుల విరామం తర్వాత శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది. జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. సాగుచేసిన పంట చేతికొచ్చే సమయం కావడంతో పత్తి, వేరుశనగ దిగుబడులపై ప్రభావం చూపుతుందని, దీనివల్ల నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.