ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని పోతుల పాలెం గ్రామంలో ప్రజలకు బుధవారం డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు దోమల నివారణ పై అవగాహన కల్పించారు. పరిసర ప్రాంతాలను ఆశా వర్కర్లతో కలిసి పరిశుభ్రం చేయడంతో పాటు దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ప్రజలకు వెంకటేశ్వర్లు తెలిపారు. ఎప్పటికప్పుడు మురుగునీటిని తొలగించడంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు వివరించవచ్చని వెంకటేశ్వర్లు ప్రజలకు తెలిపారు.