తాడిపత్రి: తాడిపత్రిలోని కృష్ణాపురం కాలనీలో మల్లేశ్వరమ్మ ఇంటిలో చోరీ, 10 తులాల బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదు అపహరణ
తాడిపత్రిలోని కృష్ణాపురంలో నివాసం ఉండే మల్లేశ్వరమ్మ ఇంటిలో చోరీ జరిగింది. బీరువాలో ఉంచిన 10 తులాల బంగారు, వెండి ఆభరణాల తోపాటు రూ. 30 వేలు నగదు అపహరించారు. శుక్రవారం మల్లేశ్వరమ్మ ఇంటికి తాళాలు వేసి వేరే ఊరికి వెళ్ళింది. శనివారం తిరిగి వచ్చింది. ఇంటి తలుపులు తెరవబడి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి పరిశీలించింది. బీరువాలో ఉన్న బంగారు, వెండి, నగదు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతపురం నుంచి క్లూస్ టీం సభ్యులు వచ్చి చోరీ జరిగిన ఇంటిలో వేలు ముద్రలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.