మాదిపాడు గ్రామ శివారులోని పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
శ్రీశైలం నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో దిగుకు వచ్చిన వరద నీరు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామం వద్ద ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టుకు చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి మూడు లక్షల 505454క్యూసెక్కుల నీరు వస్తుండగా 3,75080 క్యూసెక్కుల నీరు బయటకు విడుదల అవుతుందని ఈఈ గుణాకర రావు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 38.36 మీటర్ల మేర నీటిమట్టం ఉందని నాలుగు మీటర్ల మేర 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.