12వ జాతీయ కరాటే పోటీలలో పీలేరు మార్షల్ యోదా విద్యార్థుల ప్రతిభ
కర్నూలు లో ఈ నెల 14న జరిగిన G.K.M.A 12వ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో పీలేరు యోధా కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభ ను కనబరిచారు. ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొనడానికి 12రాష్ట్రాల నుండి1500మంది విద్యార్థులు పాల్గొన్నారు. కాంపిటీషన్ చాలా కటినంగా వున్నప్పటికీ పీలేరు యోదా అకాడమీ 9మంది విద్యార్థులు గీతాశ్రీ, వికాస్, ఫరూక్, ముదిత్, సాయి,సావన్, సహస్ర, అశ్విన్, పునీత్ తమ తమ వయసు మరియు బరువును బట్టి కరాటే, ఫైట్ రెండు విభాగాలలో పాల్గొని 7బంగారు పతకాలు, 3 వెండి పతకాలు, 2 కాంస్య పతకాలను సాధించినట్లు కరాటే మాస్టర్ఊ జి.ఇనాముల్ హక్ సోమవారం మధ్యాహ్నం 3గంటలకు తెలిపారు.