కళ్యాణదుర్గం: టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ, కళ్యాణ దుర్గం నియోజక వర్గం నుంచి ముగ్గురు దరఖాస్తు
అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. కళ్యాణ దుర్గం నియోజవర్గం నుంచే ముగ్గురు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు మారుతి చౌదరి, సీనియర్ నాయకులు రామ్మోహన్ చౌదరి, డీ ఎన్ మూర్తి జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు సోమవారం తెలిపాయి. ఒక నియోజకవర్గం నుంచి ముగ్గురు పోటీలో ఉన్నారు. జిల్లా లో మరి కొంతమంది పోటీ పడుతున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపారు.