నూజివీడు ఎక్సైజ్ సిఐ కార్యాలయం వద్ద స్థానిక జగనన్న కాలనీ వాసులు ధర్నా, మద్యం దుకాణాన్ని తొలగించాలని డిమాండ్
Eluru Urban, Eluru | Sep 22, 2025
ఏలూరు జిల్లా నూజివీడులోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక జగనన్న కాలనీ వాసులు సోమవారం మధ్యాహ్నం 3గంటలకు నిరసన చేపట్టారు. కాలనీ సమీపంలో వైన్స్ షాపు ఏర్పాటుతో ఇబ్బందులు పడుతున్నామని, మందుబాబులు ఇళ్లలోకి చొరబడుతున్నారని, దారిలో నడిచివెళ్తుంటే అసభ్యకరమైన మాటలు ఆడుతున్నారని ఆ కాలనీ మహిళలు ఆవేదన చెందారు. వారు నిత్యం పడుతున్న బాధలను మీడియాకు తెలిపారు. రక్షణ కల్పించాలని కోరారు.