ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలి.జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ తోడ్పాటుతో అనంత వ్యవసాయం అభివృద్ధి :జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Nov 4, 2025
జిల్లాలోఉన్నగ్రామపంచాయతీ స్థాయివరకుప్రకృతివ్యవసాయంను విస్తరింప చేయాలని అలాగేజాతీయప్రకృతివ్యవసాయ మిషన్ తోడ్పాటుతో అనంత వ్యవసాయ అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అనంతపురంలోని జిల్లా ప్రాజెక్ట్ ఆఫీస్, రైతు సాధికార సంస్థ కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ అవగాహనశిక్షణకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ లో భాగంగా ఈనెల 3 నుండి7వరకుఐదురోజులపాటు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.