ఆలూరు: దేవనకొండలో నీటమునిగిన పత్తి పంటలు
Alur, Kurnool | Sep 17, 2025 దేవనకొండ మండలంలో నిన్న కురిసిన భారీ వర్షానికి పత్తి పంటలు నీట మునిగాయి. అనేక ఎకరాల్లో నీరు నిల్వ ఉండటంతో పంటలు కుళ్లిపోతున్నాయని, అప్పులు చేసి సాగు చేశామని, బుధవారం రైతులు బసవన్న వీరేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, మందుల కోసం అప్పులు చేశామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.