ఉదయగిరి: ఉదయగిరిలో బురద మయంగ మారిన సబ్ ట్రెజరీ,తహసిల్దార్ కార్యాలయాల ఆవరణలు
ఉదయగిరి తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణం నుంచి సబ్ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లే దారి బురదమయంగా మారింది. వివిధ పనులపై కార్యాలయానికి వెళ్లే వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఆవరణ సైతం రొచ్చుగా తయారైంది. అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.