పులివెందుల: వేంపల్లి లో కింద పడిపోయిన వరి పంటను పరిశీలించిన అగ్రికల్చర్ ఏడీ ప్రభాకర్ రెడ్డి
Pulivendla, YSR | Oct 30, 2025 మోంధా తుఫాను ప్రభావం కారణంగా వేంపల్లి మండలంలో వరి పంట రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి పంట కింద పడిపోయి నీట మునిగింది. విషయం తెలుసుకున్న వ్యవసాయ ఏడి ప్రభాకర్ రెడ్డి, వేంపల్లి మండల వ్యవసాయ అధికారి శివశంకర్ రెడ్డి మండల పరిధిలోని ఆయా గ్రామాలలో వరి పంటలను పరిశీలించారు. అనంతరం రైతులకు పలు సూచనలు చేశారు. వరి గింజలు మొలకెట్టకుండా పొలంలో ఉన్న నీటిని తొలగించాలని చెప్పారు. కింద పడిపోయిన వరి పంటను పైకి లేపి ముడులు వేయాలన్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పంటను కాపాడుకోవచ్చు అన్నారు.