కుప్పం: శాంతిపురం : రోడ్డు పక్కన టీ కొట్టులో స్థానిక నేతలతో టీ తాగిన నారా లోకేష్.
శాంతిపురం మండల కేంద్రంలో మంత్రి నారా లోకేష్ సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఓ టీ దుకాణంలో స్థానిక నాయకులతో కలిసి టీ తాగారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులను మంత్రి లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నేతలు సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు