సూర్యాపేట: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులపై అక్రమ కేసులు హేయమైనా చర్య అని నిరసన
సూర్యాపేట జిల్లా: ఖమ్మంలో జర్నలిస్టుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యాపేట జర్నలిస్టుల ఆధ్వర్యంలో వాణిజ్య భవన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. జర్నలిస్టుపై అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తున్నామని నినాదాలు చేపట్టారు. వెంటనే జర్నలిస్టుపై పెట్టిన కేసును ఎత్తివేయాలన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం హే యమైన చర్య అన్నారు..