మేడ్చల్: మునీరాబాద్ ప్రధాన రహదారి పక్కన ట్రాన్స్పోర్ట్ లో చెలరేగిన మంటలు
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. మునీరాబాద్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న పంజాబ్ హర్యానా ట్రాన్స్పోర్ట్ లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి. సిబ్బంది భయాందోళనకు తో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.