ఆలూరు: దేవనకొండలోని అంగన్వాడీలో పౌష్టికాహార దినోత్సవ వేడుకలు
Alur, Kurnool | Sep 17, 2025 దేవనకొండలోని అంగన్వాడీ-1 కేంద్రంలో పౌష్టికాహార దినోత్సవాన్ని ఐసీడీఎస్ సూపర్వైజర్ శివలింగమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు, గర్భిణులకు పౌష్టికాహార ప్రాముఖ్యతను వివరించామన్నారు. సక్రమమైన ఆహారపు అలవాట్లతో శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందని చెప్పారు. అనంతరం చిన్నారులకు గుడ్లు, పాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిబ్బంది వెంకటలక్ష్మి, జ్యోతి లక్ష్మి పాల్గొన్నారు.