లక్కవరంలో జరిగిన దొంగతనం కేసు వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర
Eluru Urban, Eluru | Sep 23, 2025
జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో జరిగిన దొంగతనం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఓఇంట్లో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని ముగ్గురు ఆగంతకులు చొరబడి వృద్ధులను బెదిరించి సుమారు 15 నుంచి 20 కాసుల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. డాగ్, క్లూస్ నిపుణులు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.