పులివెందుల: బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు : చక్రాయపేట జడ్పిటిసి శివప్రసాద్ రెడ్డి విమర్శ
Pulivendla, YSR | Sep 26, 2025 నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశం లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పైన, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని చక్రాయపేట జడ్పిటిసి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. గతంలో వైయస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నపుడు, వైయస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నపుడు నీకు చేసిన మేలును మరచిపోయావా అని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో హుందాగా వ్యవహరించాలి తప్ప అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని జడ్పిటిసి శివప్రసాద్ రెడ్డి తెలిపారు.