బనగానపల్లె విద్యుత్ శాఖ ఏఈలను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
బనగానపల్లెలో విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్లు సస్పెండ్ నంద్యాల జిల్లా బనగానపల్లె విద్యుత్ శాఖ అర్బన్ ఏఈ శ్రీనివాసులు రూరల్ ఏ ఈ గంజప్పలను విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం సస్పెండ్ చేశారు. రైతుల వద్ద నుండి పంట పొలాలకు ట్రాన్స్ఫర్లు అమర్చడంలో నగదు తీసుకొని రైతులకు కనెక్షన్లు ఇవ్వకుండా వేధించడంతో ఈ విషయాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఇద్దరు ఏ ఈలపై సస్పెండ్ వేటు వేశారు