ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని సబ్ జైలుని శుక్రవారం ఒంగోలు సీనియర్ సివిల్ జడ్జ్ ఇబ్రహీం షరీఫ్ ఆకస్మికంగా సందర్శించారు. ఖైదులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు సకాలంలో ఆహారం అందాలని అంతేకాకుండా వారు నివసిస్తున్న ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని జైలర్‌కు ఇబ్రహీం షరీఫ్ తెలిపారు. ఖైదీలకు న్యాయ సేవలు కావాలంటే తమ సంస్థ నుంచి న్యాయ సేవలు అందేలా చూస్తామని ఖైదీలతో అన్నారు.