జంగారెడ్డిగూడెంలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
Eluru Urban, Eluru | Sep 27, 2025
పొగాకు రైతుల ఇబ్బందులను తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కలిసి కేంద్రం దృష్టికి తీసుకు వెళ్ళి గట్టిగా ప్రయత్నించడంవల్ల అదనపు పొగాకు కొనుగోళ్లకు కేంద్రం అనుమతించిందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. శనివారం సాయంత్రం 3:30 గంటలకు జంగారెడ్డిగూడెం లోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కొనుగోళ్ల తీరుని పరిశీలించారు. అనంతరం రైతులను, మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. స్వల్ప పెనాల్టీతో అదనపు పొగాకు కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంవల్ల ఏలూరు జిల్లాలో వర్జీనియా పొగాకు రైతులకు దాదాపు 74 కోట్ల లబ్ది చేకూరిందన్నారు.