ముక్కంటిని దర్శించుకున్న కేరళ హైకోర్టు న్యాయమూర్తి బసంత్ బాలాజీ
ఓం నమః శ్శివాయ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీకాళహస్తి జస్టిస్ శ్రీ బసంత్ బాలాజీ, జడ్జి, హైకోర్టు ఆఫ్ కేరళ వారు ఈరోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి యున్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది. సదరు కార్యక్రమంలో ప్రోటోకాల్ AEO మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఇన్స్పెక్టర్ సుదర్శన్, APRO రవి మరియు స్థానిక కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.