అసిఫాబాద్: వెంకట్రావ్ పేట శివారులో అక్రమంగా తరలిస్తున్న 4 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత,ముగ్గురిపై కేసు నమోదు
ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాజ్ కుమార్, శ్రీనివాస్ పట్టుకున్నారు. సిర్పూర్ (టి) మండలం వెంకట్రావుపేట చెక్పోస్ట్ వద్ద గురువారం తెల్లవారుజామున మూడు ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్న 4 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కౌటాలకు చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు.