ప్రధాని నరేంద్ర మోడీ తన పుట్టినరోజున మహిళల ఆరోగ్యానికి మంచి పథకం ప్రవేశపెట్టారు: ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
Ongole Urban, Prakasam | Sep 17, 2025
దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన పుట్టినరోజున మహిళల ఆరోగ్యం కోసం మంచి పథకాన్ని ప్రవేశపెట్టారని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. బుధవారం ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన స్వస్త్ నారి, సశక్త్ పరివార్ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎంపీ మాగుంట కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య ఇబ్బందులను గుర్తించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన పుట్టినరోజున మహిళలకు ఆరోగ్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో మంచి పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.